ఈ చావులు ఇంకెన్నాళ్ళు..? గురుకుల ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలి, బిసి గురుకులాల పని వేళలు మార్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF). తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి చదువుల పేరిట ఉపాధ్యాయులు, విద్యార్థులపై కలిగిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడిని నివారించాలని, వత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల మరణాలను అరికట్టాలన్నారు.
ఉపాధ్యాయులకు బోధనేతర విధులను తగ్గించాలని, పాఠశాలలకు శాశ్వత వసతి కల్పించాలన్నారు. పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయులకు నివాస వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పనివేళల్లో మార్పు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు.