కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పరీక్ష రాసిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎస్సై మరియు కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్ మార్కులను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
పరీక్షల్లో మొత్తం 200 మార్కులకు గాను ఓసీ అభ్యర్థుల 30%, బీసీ అభ్యర్థులు 25% అలాగే ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికో ఉద్యోగులు 20 శాతం మార్కులు పొందితే అర్హత సాధిస్తారని తాజాగా స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో జరిగిన పరీక్షల్లో కట్ ఆఫ్ మార్కులు ఓసీలకు 40 శాతం బీసీలకు 35% ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనిక్ ఉద్యోగులకు 30 శాతంగా ఉండేవి. ఇక గత ఆగస్టు లో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ ముప్పై శాతం కట్ ఆఫ్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై పరీక్ష రాసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.