బ్రేకింగ్: రేపటి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ బంద్

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం సంచలన నిర్ణయం ప్రకటించింది .రాష్ట్రంలో రేపటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులిచ్చింది.

Government if Telangana

రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా మార్పులు చేయడానికి సీఎం కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గత కొంతకాలంగా రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు కూడా ఎమ్మార్వోలు ఏదో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది.

రెవిన్యూ శాఖలో కొత్త చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్లలో ఎమ్మార్వో అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించనుంచి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలను ఎమ్మార్వోలకు అప్పగించే ఆలోచనలో ఉంది. గృహ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్టార్ లకు అప్పగించి ఆలోచనలో ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉన్నాయి. కొన్ని చోట్ల తగ్గించి కొన్ని చోట్ల పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 20 వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లను తగ్గించి ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.పట్టణ ప్రాంతాల్లో 20 కి పైగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ను తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ చట్టానికి క్యాబినెట్ లో ఆమోదం తెలపనుంది రాష్ట్ర ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version