జూలై 29న ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల.. పూర్తి వివరాలు…

-

కరోనా వల్ల గత ఏడాది ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు..ఇప్పుడు మహమ్మరి తీవ్రత పూర్తిగా తగ్గడంతో వరుసగా అకాడమిక్ పరీక్షలను, ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల లో గత నెలలో జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ ఫలితాలు జులై 29న విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురంలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/  వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ ఆన్సర్‌ కీ జూలై 12 విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.. ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ , ఫార్మసీ పరీక్ష నిర్వహించారు..

ఈ పరీక్షల కోసం 120 సెంటర్లను ఏర్పాటు చెయ్యగా, తెలంగాణ లో మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో AP EAPCET 2022లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగా ఇవ్వనున్నారు.. వచ్చే నెల మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించి, ఆగస్టులోనే కాలేజీలను ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version