కరీంనగర్-మెదక్- నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగింది. ఓట్ల వడబోత చేపట్టిన అధికారులు వాటిని కట్టలు కట్టారు. ఇక వాటిని అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం సాధించారు.
మెదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 6,697, కాంగ్రెస్కు 6,673, బీఎస్పీకి 5,897 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24 ఓట్ల ఆధిక్యం లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నట్లు మొదటి రౌండ్ ఫలితాలను చూస్తే స్పష్టంగా అర్ధం అవుతోంది.