వాలంటీర్ల ద్వారా ఏపీలో మత మార్పిడి, టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు…!

-

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి పై టీడీపీ నేత బోండా ఉమ ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందు మతం పై, దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆయన ఆయన మండిపడ్డారు. మత మార్పిడులు ఏపీలో పెరిగాయన్నారు. హిందు మతం పై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే నేడు అంతర్వేది ఘటన జరిగేది కాదు అని ఆయన అన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి గుడిని గుడిలో లింగాన్ని మింగే రకమని అన్నారు.

వెల్లంపల్లి లంచాలు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు. కరోనా పేరుతో వ్యాపారుల దగ్గర మంత్రి వెల్లంపల్లి 10కోట్లు కొట్టేశారని ఆయన ఆరోపణలు చేసారు. పిఠాపురం లో ఒకే రోజు 23 గుళ్లపై దాడులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. దుండగులు ఏమి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అందుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. వెల్లంపల్లి 30ఏళ్లకు సరిపడా డబ్బు దండుకున్నారని మండిపడ్డారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని, వెల్లంపల్లి కలెక్షన్ కింగ్ లా మారారని ఆరోపణలు చేసారు. గ్రామ వాలేంటీర్ల తో మత మార్పిడిలు ఈ ప్రభుత్వం చేయిస్తుందని విమర్శలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version