భర్తను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయినా మలైకా అరోరా..

-

మలైకా అరోరా 49 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని అందంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతుంది ఈ భామ.. అయితే ప్రస్తుతం అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న ఈమె తాజాగా తన భర్త అర్భాజ్ ఖాన్ ను తెచ్చుకొని ఎమోషనల్ అయింది..

మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది ఈ భామ.. అయితే తాజాగా అర్భాజ్ ఖాన్ ను గుర్తు తెచ్చుకొని ఒకింత ఎమోషన్ అయింది మలైకా..

“అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత దారుణమైన జీవితాన్ని గడిపాను. అయితే ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. నా జీవితంలో జరుగాల్సింది జరిగిపోయిందని అనుకొన్నాను. భవిష్యత్‌లో ఏం చేయాలనే ప్లాన్ చేసుకొన్నాను. అంతేగానీ… ఎవరు ఏమనుకొంటున్నారు. నేను ఎలా రియాక్ట్ కావాలి అనే విషయాన్ని ఆలోచించలేదు.. అలాగే ఈ మధ్యకాలంలో మాకు యాక్సిడెంట్ అయింది.. ఎదురుగా వస్తున్న లారీ మా వాహనాన్ని ఢీకొట్టింది. ఆ క్షణంలో నాకు ఏం జరిగిందో అర్ధం కాలేదు. ముఖం నిండా గాయాలు. కంటికి పక్కన ఓ గాజు ముక్క కుచ్చుకొన్నది. ఆ ప్రమాదం సమయంలో అర్బాజ్ ఖాన్, ఆయన ఫ్యామిలీ తీసుకొన్న జాగ్రత్తలు నన్ను ఎమోషనల్‌గా మార్చాయి. అర్బాజ్ నాకు అవసరమైన సహాయం చేశాడు. మా మధ్య బ్రేకప్ అయినా నా కోసం హాస్పిటల్‌లో చాలా రోజులు ఉన్నాడు. నాకు సర్జరీ జరిగిన తర్వాత నా కంటి చూపు బాగుందా అని ఆందోళన పడ్డారు. నా ముఖం ముందు చేతులు పెట్టి ఎన్నీ వేళ్లు.. ఇవి ఎన్నీ వేళ్లు అంటూ అడిగాడు… ఆ సమయంలో అతను ప్రేమ చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు..” అంటూ చెప్పుకొచ్చింది మలైకా..

Read more RELATED
Recommended to you

Exit mobile version