కరోనా చికిత్సకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంజక్షన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెమీడెసివర్ అనే ఇంజక్షన్ విషయంలో ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా చికిత్స నుంచి రెమీడెసివర్ ఇంజక్షన్ ని తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. రెమీడెసివర్ ఇంజక్షన్ వాడొద్దు అంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు.
రెమీడెసివర్ వాడి కరోనా నుంచి కోలుకున్నట్టు ఆధారాలు లేవు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఇక మన దేశంలో దీని బ్లాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది ఏంటీ అనేది అందరికి తెలిసిందే. బ్లాక్ మార్కెట్ తో ప్రజల జేబులు అన్నీ కూడా గుల్ల అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రులు కూడా దీని దందా భారీగా చేస్తున్నాయి.