గూగుల్ నిబంధనలు ఉల్లంఘించిన లోన్ యాప్‌లపై ఉక్కుపాదం మోపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్‌లను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జులై నెలాఖరు వరకు దాదాపు 2 వేల లోన్ యాప్‌లను తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. పాలసీ ఉల్లంఘన, సమాచార సేఫ్టీ, తప్పుడు సమాచారం చూపించడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల భద్రతా నేపథ్యంలో లోన్ యాప్‌లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది.
అయితే ఈ లోన్ యాప్‌లు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా పని చేస్తున్నాయని సంస్థ వెల్లడించింది. మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ క్రమంలో విచారణ జరిపి లోన్ యాప్‌లను తొలగించినట్లు గూగుల్ ఏపీఏసీ సీనియర్ డైరెక్టర్ సైకత్ మిత్రా అన్నారు. దాదాపు 2 వేల లోన్ యాప్‌లు 50 శాతానికి పైగా గూగుల్ నిబంధనలు ఉల్లంఘించాయని, అందుకే వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరిగిందన్నారు.