ఇది విన్నారా.. పవన్ కల్యాణ్ సినిమాలో రేణూ దేశాయ్‌..?

-

ఒక‌ప్పుడు మంచి హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన రేణూ దేశాయ్‌.. ప‌వ‌న్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి పూర్తిగా దూరంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుణెలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు. అయితే సుదీర్ఘ విరామం తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ చిత్రంలో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా నటించనున్నారట. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే, మెగా ఫ్యాన్స్ కు పండగే.

గతంలో ‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారన్న సంగతి తెలిసిందే. తాజాగా పింక్ రీమేక్ లో, ఓ కీలకమైన పాత్రను రేణూ పోషించనున్నారని సమాచారం. సినిమాలో ఓ పిల్లవాడి తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్, రేణూను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version