ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే అఖీరానందన్ , ఆద్య జన్మించిన తర్వాత 2013లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతోంది ఈ జంట . ఇదిలా ఉండగా అప్పట్లో పలు ఇంటర్వ్యూలలో తోడు అవసరం అని రేణు దేశాయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు 2018 లో ఒక వ్యక్తిని ఇష్టపడిందని, అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఇక రేణు దేశాయ్ మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. ఇక భర్త తోడు లేకపోయినా పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయపడే ఈమె అంటే చాలామందికి సమాజంలో గౌరవం కూడా.. అనవసరమైన విషయాల్లో ఎప్పుడూ తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ చాలా ఉన్నతంగా జీవిస్తోంది అని చెప్పవచ్చు.