మరో రూ.2 వేల కోట్లు అప్పు చేయనున్న కేసీఆర్ సర్కార్ !

-

కేసీఆర్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల మేర నిధులను సమీకరించుకోవాలని యోచిస్తోంది. విలువైన బాండ్లను ఎనిమిదేళ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల రూపాయలను విలువైన బాండ్లను తొమ్మిదో ఏళ్ళ కాలానికి జారీ చేసింది. ఈ బాండ్లను వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వచ్చే మంగళవారం వేలం వెయనుంది.

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 23న రూ.1000 కోట్లను రుణాల ద్వారా ప్రభుత్వం నిధులను సమీకరించుకోగా రెండు వారాలకే మరో రూ. 2వేల కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో FRBM పరిధికి లోబడి ప్రభుత్వం తీసుకునే రుణాల మొత్తం రూ. 18,500 కోట్లు చేరనుంది.

వీటికి మూలధనం కింద ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధి కి బాటలు వేయాలని సర్కారు భావిస్తున్నది. ఆగస్టు 23న బాండ్ల విక్రయం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు సమీకరించుకుంది. వీటిలో రూ.500 కోట్ల విలువైన బాండ్లను 23 ఏళ్ల కాలానికి, మరో 500 కోట్ల విలువైన బాండ్లను 24 ఏళ్ల కాల పరిమితితో తెలంగాణ సర్కారు రుణం పొందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version