వాము ఆకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన పరిశోధనలు.. వాడుతున్నారా..!

-

ఈ మధ్యకాలంలో ఇళ్లలో వాము ఆకులను పెంచుకోవడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. వాము ఆకు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలుసు కానీ.. వాటిని ఎలా వాడాలో తెలిసి ఉండదు. ఈరోజు మనం వాము ఆకు మీద వివిధ దేశాలు చేసిన పరిశోధనలు ఏం చెప్తున్నాయి, వాటిని ఎలా వాడుకోవచ్చు, ఇంట్లో పెంచుకోవడం ఎలానో చూద్దాం.

వాము ఆకు మీద ఎంతోమంది పరిశోధనలు చేసి చాలా విషయాలు చెప్పారు. ఆకలి పెంచడానికి, అరుగుదల బాగా చేయడానికి, ఎంజైమ్స్ ఉత్పత్తి పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా వాము ఆకులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఇవి బాక్టీరియాలను, ఫంగస్ క్రిములను బాగా చంపేస్తాయని చైనావారు పరిశోధన చేసి చెప్పారు.

పాకిస్తాన్ వారు కూడా వాము ఆకు మీద పరిశోధన చేసి.. వాము ఆకు LDL అనే బ్యాడ్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరెయిడ్స్ ను బాగా ఉపయోగపడుతుందని నిరూపించారు. పాకిస్తాన్ వారే మరొక పరిశోధన చేసి ఇందులో తైమాన్, కార్వకాన్ అనే యాంటీఆక్సిడెంట్స్..బ్లడ్ విజల్స్ ఉండే కాల్షియం ఛానల్స్ ను రెగ్యులేట్ చేసి బీపీని నియంత్రిస్తుందని 1995లోనే పరిశోధన చేసి ఇచ్చారు.

2014లో ఇరాన్ వారు పరిశోధన చేసి చాలా విషయాలు చెప్పారు. లంగ్స్ లో కఫం, శ్లేష్మాలు నిల్వ ఉంటే.. ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి.. దుర్వాసన వస్తుంది. ఇది నిమోనియాగా మారకుండా వాము ఆకు రక్షిస్తుందని వీరు నిరూపించారు. ఇంకా..లివర్ సెల్స్ లో సెల్ వాల్ డామేజ్ అవకుండా రక్షించడానికి వాము ఆకులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అని కూడా కనుగొన్నారు. వాము ఆకులో ఒక స్పెషల్ ప్రోటీన్ ఉంది..ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా.. ఎక్కువైన కాల్షియం ప్రోటీన్ లాక్కోని రాళ్లు అ‌కుండా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఇన్ని దేశాల వారు వాము ఆకు మీద పరిశోధన చేసి..ఈ విషయాలన్నీ చెప్పారు.

వాము ఆకును వాడుకోవడం ఎలా..?

వాము ఆకుతో బజ్జీలు వేసుకుంటాం, చట్నీలుచేసుకోవడం చేస్తుంటాం. వీటితో పాటు.. కూరల్లో కూడా వాడుకోవచ్చు, కషాయాల్లో వాము ఆకులు వేసి మరిగించవచ్చు. అందులో ఉండే ఫ్లైవనాయిడ్స్, పాలిఫినాల్స్ అన్నీ మరిగే సరికే నీళ్లలోకి వస్తాయి. దీన్ని ఫిల్టర్ చేసుకుని తాగడం మంచిది.

వాము ఆకు పెంచుకోవడం ఎలా..?

వామును విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. కంపోస్టు, కొబ్బరి పీచు మిశ్రమాన్ని ట్రేలో గానీ, సిమెంట్‌ తొట్టెలో గానీ నింపి అందులో పై పైన వాము గింజలు చల్లాలి. ఆ తర్వాత పైన పల్చగా మట్టిని వేయాలి. నీడలో ఉంచి ఉదయం, సాయంత్రం నీటిని తుంపరలుగా చల్లాలి. వారం నుంచి రెండు వారాల్లో మొలకెత్తుతాయి. సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఎండపడే ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. ఆకులు ఎండిపోతే తెంపి పారేయాలి. పురుగులు పడితే వేపనూనె పిచికారీ చేయాలి. తొట్టిలోని మట్టి తడారకుండా చూసుకోవాలి.

అందరి ఇళ్లలో వాము ఆకును కుండీల్లో పెంచుకుని లేత ఆకులను వాడుకోవడం చాలా మంచిది. ప్రకృతి మనకు అందించిన ప్రతి దానిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోలేకపోవడమే మన తప్పు. తెలిసిన వాటిని వాడకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఈ రోజుల్లో ఏ వయసు వారి ఆరోగ్యం కూడా అంత మంచిగా లేదు. ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్తే చిన్న చిన్న వాటికే వేలల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి డైలీ మన జీవనశైలిని నాచురల్గా మార్చుకుంటే..ఆరోగ్యాన్ని అందంగా మలుచుకున్నట్లే.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version