ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో 23 వేల కోట్ల రుణం అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రిజర్వు బ్యాంకు తెలియజేసింది. రిజర్వు బ్యాంకు వర్గాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించి జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఇంత దారుణం అవసరమవుతుందో సమాచారం సేకరించాయి.
ఈ సమాచారం మేరకు రుణ డిమాండ్ క్యాలెండర్ను రూపొందించాయి. దాని ప్రకారం జనవరి లో 5వేల కోట్లు, ఫిబ్రవరిలో 11 వేల కోట్లు, మార్చి మాసంలో 7 వేల కోట్ల చొప్పున మొత్తం 23 వేల కోట్ల రూపాయలు అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ పై… రిజర్వు బ్యాంకు అధికారులు ఎంత రుణం ఇవ్వా లి అనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అడిగినట్లుగా నే 23 వేల కోట్లు రిజర్వు బ్యాంకు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.