సచివాలయం కూల్చివేత పై రేవంత్ ఫైర్…!

-

తెలంగాణ సచివాలయం కూల్చివేత పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వాస్తు నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం మొత్తాన్ని కూల్చేయడం మంచిది కాదని ఆయన ఘాటుగా స్పందించారు. అది మాత్రమే కాకుండా తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నాడని అందుకే సచివాలయం కూల్చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు ఆరోపించారు. ఎవరికైనా సెంటిమెంట్ తప్పుకాదు కానీ, ఇలాంటి మూఢనమ్మకాలు మంచిది కాదని ఆయన తెలంగాణ ప్రభుత్వం పై ఫైర్ అయ్యాడు.

revanth-reddy

కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ వందలాది కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి తెలియజేశారు. వీటితో పాటు పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం ను ఎలా కూల్చేస్తారంటూ సూటిగా ప్రశ్నించారు ఆయన. అలాగే ప్రస్తుతం సచివాలయంలో కూల్చిన బిల్డింగుల గార్బేజ్ ను ఎక్కడ పడేస్తారో చెప్పాలంటూ రేవంత్ రెడ్డి అడిగారు. అంతేకాకుండా సచివాలయం లో ఉండే చర్చి, మసీద్, నల్ల పోచమ్మ గుడి లను కూల్చివేయడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి నల్ల పోచమ్మ గుడి వేదిక అని, కాని వారి మనోభావాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా దెబ్బతీశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఇతర పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version