బ్రేకింగ్ : బీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగనున్న రేవంత్ రెడ్డి

-

నోయిడాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. హత్రాస్ పూర్ లో గ్యాంగ్ రేప్ కు గురయ్యి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శంచడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ ప్రెస్ వద్దకు రాహుల్ గాంధీ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. అయితే వాళ్ళు కూడా తగ్గకుండా కార్యకర్తలతో కలసి కాలినడక వెళ్లడానికి ప్రయత్నించారు.

పోలీసులు వారిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ కిందపడిపోయారు. అయితే పోలీసులు కావాలనే ఇలా పడేశారని  రాహుల్ మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా కాసేపట్లో బీజేపీ ఆఫీస్ కి రేవంత్ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేయనున్నారు రేవంత్. ఇక ఈ ఘటన మీద జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ ,ప్రియాంక గాంధీ ల పై యూపీ పోలీసు తీరుని తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఆయన పరామర్శించడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా కింద పడేస్తారా..! అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సింది పోయి పరామర్శించడానికి వెళ్ళిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version