KOMURAMBHEEM: కొమురం భీమ్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించిన జీవో 49 నిలిపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జీవో 49 ను నిలుపుదల చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క,ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు. కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కు సంబంధించిన జీవో నంబర్ 49ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు.