రాహుల్ జీ.. మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు… రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

రాహుల్ జీ.. మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు. త్వరలోనే మీ తప్పు తెలుసుకుంటారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన రేవంత్ రెడ్డిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. మా నాయకుడు కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా నిలచిన రాజనీతిజ్ఞుడు అన్నారు. అస్సాం సీఎం, రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. దివంగత రాజీవ్ గాంధీ గౌరవాన్ని కాపాడారని కేటీఆర్ అన్నారు. మీ పీసీసీ నాయకుడు మాత్రం మా నాయకుడి మరణాన్ని కోరుకుంటున్నారని ట్విట్లర్ లో వ్యాఖ్యానించారు. 

రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా.. సీఎం కేసీఆర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఈ విషయంపై నిన్న రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ మళ్లీ కాంగ్రెస్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారని… ఎన్ని చేసిన టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కలవదని అన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పుట్టిన రోజుల వేడుకలపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజులు బర్త్ డే వేడుకలు చేసుకుంటారో… 12 రోజుల దినం చేసుకుంటారో మాకు అభ్యంతరం లేదని.. మీదగ్గర డబ్బులు ఉన్నాయని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. దీనిపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version