ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టాలి: రేవంత్ రెడ్డి

-

సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్& స్టాంప్స్, రవాణా, మైన్స్& జియాలజీ, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలని అడిగి ఆయన తెలుసుకున్నారు. ఆర్ధిక సంవత్సరాలవారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగారు.

అలానే వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని కూడా చెప్పారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. అలానే అన్ని డిస్టీలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news