నేటి నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర…షెడ్యూల్‌ ఇదే

-

టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించనున్న ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ తొలిదశ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్య నేతలతో కలిసి వాహనాల్లో ములుగు గట్టమ్మ, సాయిబాబా ఆలయాలకు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి మేడారం వస్తారు. పటిష్ఠ బందోబస్తు..: యాత్రకు ములుగు జిల్లా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నారు.

తొలి రోజు మేడారం నుంచి రామప్ప వరకు దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్‌ మండలాల మీదుగా సాగనున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. 11 గంటలకు మేడారంలో సమ్మక్క, సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.

 

మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం నుంచి బయలుదేరుతారు.. కొత్తూరు, నార్లాపూర్‌ గ్రామాల మీదుగా గోవిందరావుపేట ప్రాజెక్ట్‌ నగర్‌ చేరుకుంటారు. 2 నుంచి 2:30: భోజన కార్యక్రమం (ప్రాజెక్టు నగర్‌లో) 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు: ప్రాజెక్ట్‌ నగర్‌ నుంచి పస్రా చేరుకుంటారు. 4:30 నుంచి 5 వరకు: పస్రాలో తేనీరు విరామం తీసుకుంటారు. 5 నుంచి 6 వరకు: పస్రా కూడలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 6 నుంచి 8 వరకు: పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్‌, వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌, ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్‌, ఇంచర్ల, వెంకటాపూర్‌ క్రాస్‌ మీదుగా పాలంపేట చేరుకుంటారు. రాత్రి పాలంపేట (రామప్ప)లో బస చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version