దారుణంగా  పడిపోయిన రేవంత్ రెడ్డి గ్రాఫ్ ??

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. రోజుకో మలుపు తిరుగుతుంది రేవంత్ రెడ్డి కేసు. ముఖ్యంగా సొంత పార్టీ నుండి రేవంత్ రెడ్డికి మద్దతు రాకపోవటం తో రేవంత్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్లు అయ్యింది. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న తనకి అండగా ఉండకుండా విమర్శలు చేయడంతో సొంత పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇంతగా సొంత పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ని ద్వేషించడం పట్ల ఉన్న కారణం చూస్తే, సొంత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 111 పోరాటమని చాలామంది అంటున్నారు. ఒక జాతీయ పార్టీ నాయకుడు అయ్యుండి మధ్యలో పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఈ విధంగా సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తే ఎవరూ పార్టీలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరుణంలో తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం గతంలో పోరాటం చేసి…ఇప్పుడు సొంతంగా ఒక ఎజెండాతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటే సపోర్ట్ చేసేవాళ్ళు పార్టీలో ఎవరూ ఉండరని కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మొత్తంమీద చూసుకుంటే గతంలో తెలంగాణ రాజకీయ నాయకులలో మంచి ఫైర్ బ్రాండ్ కలిగిన నాయకుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్   ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలతో పూర్తిగా పడిపోయింది. జైల్లో ఉన్నా రేవంత్ రెడ్డి కి సొంత పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు. మరోపక్క ఇదే టైం అనుకుని కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డిని రాజకీయంగా చెక్ పెట్టడానికి బెయిల్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version