రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పుపై రేవంత్ ఫైర్ : అన్ని చిల్లర రాజకీయాలు !

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎం.పీ రేవంత్ రెడ్డి… కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ను పేరు మార్చడంపై కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు ఎం.పీ రేవంత్ రెడ్డి. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా నామకరణం చేయడం చాలా దారుణమని ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఇది బీజేపీ, మోడీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనమన్నారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి అన్ని దేశంలో క్రీడా అభివృద్ధి కి ఎంతో కృషి చేసిన స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ పేరు ను ఖేల్ రత్న గా ఉండడం సముచితమని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఎప్పటి లాగే కొనసాగించాలని ఎం.పీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని.. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version