లాఠీ ఛార్జి చేస్తే మొదటి దెబ్బ నేనే తింటా..ఎవరు భయపడొద్దు : రేవంత్

-

కాంగ్రెస్‌ పార్టీ నేడు ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ కార్యక్రమం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో యువత కలిసిరావాలని పిలుపునిచ్చారు రేవంత్‌ రెడ్డి. లాఠీ ఛార్జి చేస్తే మొదటి దెబ్బ తానే తింటానని… తూటా పేలితే…మొదటి వరుసలో తానే ఉంటానని భరోసా కల్పించారు.
ఎవరు అడైర్య పడొద్దన్నారు రేవంత్‌ రెడ్డి.

గాంధీ భవన్ లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికిఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్, పిసిసి చీఫ్ రేవంత్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. శాంతి యూత మార్గం లోనే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి గాంధీ అని… శాంతియుత పోరాటాలు చేయాల్సిన బాధ్యత యువత పై ఉందన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తి ని దెబ్బతీస్తు పాలన సాగుతుందని ఫైర్‌ అయ్యారు. అధాని..అంబానీ ల చేతిలో దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతుందని.. ప్రైవేటు చేతిలో దేశాన్ని తాకట్టు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ యువత కోసం రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని.. బలిదానాల తెలంగాణ లో యువత రోడ్ల పాలై పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. అమరులు., యువత ఆశయాలు నీరు గారిపోయెల చేస్తుందని.. సైరన్ కి ముందే నాయకులు అరెస్ట్ చేస్తున్నారన్నారు. పోలీసులు… కెసిఆర్ ఆదేశాలు పాటిస్తున్నారని… శాంతియుతంగా జరగాల్సిన కార్యక్రమం … వివాదం చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version