సీఎం రేవంత్ రెడ్డికి నటి మాధవీలత సూటిప్రశ్నలు సంధించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన మాధవీలత..‘అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగింది. దాని మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు.తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంది.
నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా?..కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు పాతిక లక్షలు కాకపోయినా పాతిక వేలు అయినా ఇచ్చారా?..
పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం చేశారా? జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్లందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు.
రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి వచ్చాక ఎందుకు ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారు.గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోతే ఏనాడైనా మాట్లాడిన పాపాన పోలేదు.అందరికీ ఒకేలాగా స్పందించండి. ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలయించాలని చూస్తున్నారు అంతేగా.సినిమా బతుకులు ఎంత వచ్చి మీ కాళ్ళు మొక్కుతరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.