గద్దర్ అన్న మరణం అందరినీ బాధకు గురిచేసింది : రేవంత్‌ రెడ్డి

-

గద్దర్ అన్న మరణం అందరినీ బాధకు గురిచేసిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం లో గద్దర్ అహర్నిశలు తపించారని ఆయన అన్నారు. గద్దర్ అన్న చనిపోతే, వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకుని అక్కడికి వెళ్ళామని, గద్దర్ అన్న మరణం రాజకీయ వివాదాస్పదం కావద్దని ఇప్పటి వరకు నేను మాట్లాడలేదని ఆయన అన్నారు. కానీ.. గద్దర్ అన్న చనిపోయారు అని అసెంబ్లీలో ఉన్న సీఎంకు తెలిసినా.. సభలో నివాళులు అర్పించి చర్చించి ఉంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. అలా చేసి ఉంటే కేసీఆర్ తప్పుల్ని తెలంగాణా ప్రజానీకం క్షమించేదని, చిల్లర మల్లర రాజకీయాలకు అడ్డాగా అసెంబ్లీనీ మార్చారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌ సభలో కాంగ్రెస్ ను అతి తీవ్రంగా విమర్శించారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టీ.. సభలో రేవంత్ రెడ్డి చుట్టూ చర్చలు తిప్పారన్నారు.

కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌, రేవంత్ ఇద్దరం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళమేనని, నేను ఇండిపెండెంట్ గా గెలిచాక టీడీపీ లో చేరానన్నారు. మా ఇద్దరి నేపథ్యం టీడీపీతోనేనని, కేసీఆర్ ను యూత్ కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తే.. బాబు చెప్పు చేతుల్లోనే కేసీఆర్ రాజకీయ జీవితం మళ్ళీ మొదలయిందన్నారు. 30 ఏళ్ల వయసులో జూబ్లీ హిల్స్ సొసైటీకి డైరెక్టర్ గా ఎన్నిక అయ్యానని, నేను ఏ పొజిషన్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా.. తెలంగాణా పట్ల చిత్తశుద్దితో నే ఉన్నానని, నా ఆలోచన ఎపుడు మారలేదన్నారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version