ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటున్న రేవంత్ సర్కార్

-

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం ఇచ్చిన పత్రాలను లబ్దిదారుల నుంచి రేవంత్ సర్కార్ తిరిగి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాల పాడును ఇటీవల పైలట్ గ్రామ పంచాయితీగా ఎంపిక చేశారు. అనంతరం గత నెల 26న ఎమ్మెల్యే కోరం కనకయ్య 3 గ్రామాల్లో మొత్తం 114 మందికి ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు.

ఆ తర్వాత పది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంజూరు చేసిన ధ్రువీకరణ పత్రాల్లో ఏ అధికారి సంతకం లేదని కలెక్టర్ చేత సంతకం పెట్టించి తిరిగి ఇస్తామని అధికారులు నమ్మ పలుకుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా,దరఖాస్తులు, గ్రామసభల్లో వచ్చిన వినతులపై ప్రభుత్వం రీ సర్వే చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version