కేసీఆర్ కారణంగా…విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రజలు కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని..తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నామన్నారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కుప్పకూలిందని.. రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
ప్రయివేటు విద్యుత్ సంస్థల్లో 50శాతం కమీషన్లు దండుకున్నారని..రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 20వేల కోట్ల బకాయి పడిందని మండిపడ్డారు. ట్రాన్స్ కో, జెన్ కో కలిపి 60వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయని..కేసీఆర్ ధన దాహంతోనే ఈ పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్ళల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని… కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే తన నమ్మిన బంట్ల వద్ద కొనుగోలు చేశారని నిప్పులు చెరిగారు.
ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందంలో లోపభూయిష్టం ఉందని గతంలో ఉద్యోగి రఘు ఫిర్యాదు చేశారు…దీన్ని ఒప్పుకోని అధికారిని కేసీఆర్ బదిలీ చేశారని మండిపడ్డారు. గుజరాత్ కంపెనీతో వెయ్యి కోట్లు లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కొన్నారు…దాదాపు 10వేల కోట్లు అప్పు భారం జెన్ కో, ట్రాన్స్ కో మీద పెట్టారన్నారు.