మోడీ దుర్మార్గము కంటే కెసిఆర్ దుర్మార్గము చేస్తున్నాడు – రేవంత్ రెడ్డి

-

కాసేపటి క్రితమే చంచల్‌ గూడ జైలులో యువకులను పరామర్శించిన రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌, మోడీ సర్కార్‌ పై ఫైర్ అయ్యారు. మోడీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశ భద్రతకు ప్రమాదం వచ్చిందని… అగ్ని పద్ ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రెండు పరీక్షలు రాసిన విద్యార్దులకు రాత పరీక్షలు నిర్వహించాలని.. ఆర్మిలో 2 లక్షల పోస్టులు ఖాళీ లు ఉన్నాయని పేర్కొన్నారు.

పోలీసులు ఇంత గుడ్డిగా కేసులు ఎలా పెడతారని.. నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ మీద 307 ఎలా పెడతారని ఫైర్‌ అయ్యారు. విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు విత్ డ్రా చేసుకోవాలని… మోడీ దుర్మార్గము కంటే కెసిఆర్ దుర్మార్గము చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.

రాకేష్ అని యువకుడు చనిపోతే trs నాయకులు అంతిమయాత్ర చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దులకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళన చేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిందని.. మోడీ తో కుడబలికి కేసులు పెట్టింది రాష్ట్రమన్నారు. విద్యార్ధులకు న్యాయ సాయం చేస్తామని.. బెయిల్ వచ్చే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version