అల్లు అర్జున్ పై వేసిన కేసును ఉపసుహరించుకుంటా – రేవతి భర్త

-

అల్లు అర్జున్ పై వేసిన కేసును ఉపసుహరించుకుంటా అంటూ సంచలన ప్రకటన చేశారు రేవతి భర్త. పుష్పా 2 ప్రీమియర్ షో లో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ మాట్లాడారు. ఈ ఘటనకు అల్లూ అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం టీవీ లో చూసి తెలుసుకున్న అవసరం అయితే కేసును ఉపసుహరించుకుంటానని ప్రకటించారు.

Revathi’s husband is Bhaskar comments viral

కాగా, డిసెంబర్ 05న అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి అనగా డిసెంబర్ 04న ప్రీమియర్స్ షోలు ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ లో 9.30కి ప్రీమియర్ షో ప్రదర్శించగా.. ఈ షోకి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, అల్లు అర్జున్ ఫ్యామిలీ వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మరణించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version