రివ్యూ: సరిలేరు నీకెవ్వరు

-

విడుదల తేదీ : జనవరి 11 , 2020

Manalokam రేటింగ్ : 2.75/5

నటీనటులు : మహేశ్ బాబు , రష్మిక మందాన , విజయశాంతి , ప్రకాష్ రాజ్

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత‌లు : అనిల్ సుంకర

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

Sarileru Neekevvaru Review Manalokam : మహేశ్ బాబు సినిమా ల మీద ఫామిలీ ఆడియన్స్ – మాస్ – క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ విపరీతమైన ఆసక్తి ఉంటుంది. పోకిరి , దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన మహేశ్ గత దశాబ్దం లో హిట్ లు కొట్టాడు కానీ ఒకే రకమైన మూడ్ లో వెళుతున్నాడు అనే అపవాదు. ఉంది. సొ అందుకే మాస్ కి దగ్గర అవడం కోసం అనిల్ రావిపూడి తో సినిమా తీసిన మహేశ్ ట్రెయిలర్ , సాంగ్స్ తో ఆకట్టుకున్నాడు. అనిల్ తమ హీరో ని చాలా బాగా చూపిస్తాడు అనే ఫీలింగ్ లో ఫాన్స్ కూడా ఉన్నారు. సొ దీని బట్టి థియేటర్ లలో సరిలేరు నీకేవ్వరు ఏ మేరకు ఆడుతుంది అనేది చూద్దాం రండి. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోగలిగిందా ? ఇవన్నీ తెలుసుకుందాం ..

కథ – విశ్లేషణ :: చిన్నతనం నుంచీ దేశం అంటే ప్రాణం ఇచ్చే కుర్రాడు పెద్దయ్యాక మిలిటరీ లో మంచి స్థానం లో నిలబడతాడు – హీరో మహేశ్ బాబు (అజయ్) . అనాథ గా మిలిటరీ లో ఉండే అతనికి ఆర్మీ గొప్పతనం బాగా తెలుసు .. భారతీయులని వేధించే టెర్రరిస్ట్ ల ని చీల్చి చండాడుతున్న హీరో కి అనుకోకుండా కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. తన ఫ్రెండ్ – కొలీగ్ అయినటువంటి సత్యదేవ్ ( ఇతని పేరు కూడా అజయ్ ) చావు బతుకులా మధ్య ఉండడం మన హీరో అజయ్ ని అతని తల్లి ( విజయ్ శాంతి ) దగ్గరకి వెళ్ళేలా చేస్తుంది. టెర్రరిస్ట్ ల చెర నుంచి చిన్నపిల్లల్ని విడిపించే క్రమం లో సత్యదేవ్ తీవ్రంగా గాయపడి కోమా లోకి వెళతాడు . హీరో అజయ్ తన కొలీగ్ రాజేంద్ర ప్రసాద్ ( ప్రసాద్) తో పాటు వెళ్లడానికి సిద్ధ పడతాడు. ఈ మార్గం మధ్యలో రైల్లో హీరోయిన్ తారస పడుతుంది. ” మీకు అర్ధం అవుతుందా ” అంటూ ఆమె అతన్ని ప్రేమిస్తూ వెంట పడే క్రమం లో ఆ అమ్మాయి ప్రేమని హీరో ఒప్పుకున్నాడా ? అంతా సడన్ గా మిలిటరీ ని వదిలి రాజేంద్ర ప్రసాద్ తో వెళ్ళిన మహేశ్ కి అక్కడ తారసపడిన పరిస్థితులు ఏమిటి ? విజయశాంతి చేసిన పవర్ ఫుల్ పాత్ర ఏంటి .. ? ప్రకాష్ రాజ్ ని మహేశ్ ఎలా ఎదురుకున్నాడు ? ఇవన్నీ తెరమీద చూడాల్సిందే. రష్మిక , ఆమె ఫామిలీ తో చేసే కామెడీ బాగా పండింది. జబర్దస్త్ కామెడీ లకి బాగా అలవాటు పడిన తెలుగు జనాలకి ఈ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది అనడం లో డౌట్ లేదు. ప్రకాష్ రాజ్ – విజయ శాంతి – మహేశ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు , ఇంటెర్వెల్ బ్లాక్ , సెకండ్ హాఫ్ లో ఫైట్ ఇవన్నీ కలిసొచ్చాయి . ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పూర్తిగా డల్ అయిపోయింది .. సినిమా లో ప్రధానమైన స్ట్రాంగ్ పాయింట్ లేక ప్రేక్షకులు విసుగు చెందుతారు.

ప్లస్ పాయింట్ లు : మహేశ్ సినిమా మొత్తం మీద డిఫరెంట్ మాడ్యులేషన్స్ చూపించాడు. ఖలేజా తరవాత మహేశ్ అంతగా కామెడీ చెయ్యడం , మాస్ లూ ఇవన్నీ ఇందులోనే. సినిమా కి ప్రధాన ఆకర్షణ మహేశ్ అని చెప్పాలి. రష్మిక తో సీన్ లలో ఒక లాగా , విజయ్ శాంతి దగ్గర మరొకలా , విలన్స్ దగ్గర మరొకలా మొత్తం మీద రావిపూడి మహేశ్ లోని కొత్త నటుడిని బయటకి లాగేశాడు .. ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు . మైండ్ బ్లాక్ సాంగ్ కరక్ట్ టైమ్ లో ఫిక్స్ చేశాడు డైరెక్టర్. దాంతో పాటు మహేశ్ లుంగీ స్టెప్స్ కూడా ఫాన్స్ కి పండగే . కామెడీ ప్రధానంగా సాగిన ఈ చిత్రం లో ఫస్ట్ హాఫ్ వరకూ ట్రైన్ సీన్ కామెడీ వర్క్ ఐనా , సెకండ్ హాఫ్ కామెడీ కావాల్సినంత లేదు .. సీన్ లూ , ఫైట్ లూ , స్క్రీన్ ప్లే విషయం లో డైరెక్టర్ జాగ్రత్త తీసుకున్నాడు కానీ స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం తో అవి తేలిపోయాయి . . పంచ్ డైలాగ్స్ కూడా బాగా మూసగా కాకుండా నిజమైన ఆటో పంచ్ లు ట్రై చేశాడు అనిల్ .

మైనస్ పాయింట్ లు : ఈ సినిమా కి అతిపెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమా కథ .. అసలు కథ అనేది లేదు అని చెప్పచ్చు . చాలా తేలికపాటి లైన్ ని తీసుకుని హీరో విజృంబిస్తూ ఉంటాడు .. విజయశాంతి కోసం హీరో ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనేది ఎవ్వరికీ అర్ధం కాదు. విజయ శాంతి కారెక్టర్ కి అనుకున్నంత స్కోప్ ఇవ్వలేదు .. స్క్రీన్ మీద పాటలు ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చెయ్యచ్చు . దేవీ శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం సినిమా కి మైనస్ గా నిలుస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేసినా రొటీన్ గానే తేలిపోయింది . ఎన్నో సంవత్సరాల నుంచీ తెలుగు ప్రేక్షకులు చూస్తున్న స్క్రీన్ ప్లే ఇది . . దానికి కామెడీ రంగు పులిమేశాడు డైరెక్టర్ .. క్లాస్ ఆడియన్స్ పెద్దగా ఎక్కించుకునే సినిమా కాదు .. హీరోయిన్ పూర్తిగా తేలిపోయింది మహేశ్ ముందు చాలా చిన్నపిల్లలా అనిపించింది. ఛ‌లో లాంటి సినిమాల్లో ఆమె చాలా అందంగా ఉంటుంది. గీత‌గోవిందంలో కూడా.. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు అందం, హుందాత‌నం మిస్ అయ్యాయి.

సాంకేతిక విభాగం : ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రఫీ విషయం లో సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. కెమెరా పనితనం ట్రైన్ సీన్ లలో మెచ్చుకోవాలి .. ట్రైన్ ఫైట్ విషయం లో టెక్నికల్ టీం కష్టం అంతా బయటపడింది. నేపధ్య సంగీతం విషయం లో దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా బెటర్ గా వర్క్ చేసి ఉండచ్చు . విజయశాంతి దగ్గర నుంచి మహేశ్ వరకూ అందరి కాస్ట్యూమ్స్ సూపర్ గా సెట్ అయ్యాయి ..

తీర్పు : సంక్రాంతి కి మహేశ్ బాబు బడా పైసా వసూల్ మాస్ సినిమా దింపుతాడు అనీ – ఎంటర్టైన్మెంట్ బేస్ గా ఇరగదీస్తాడు అనుకున్నవారికి ఈ సినిమా నిరాశ నే మిగులుస్తుంది … అనిల్ రావిపూడి ప్రామిస్ చేసినట్టుగానే ప్రేక్షకులకి కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ అది ఫస్ట్ హాఫ్ ట్రైన్ ఎపిసోడ్ వరకే సెట్ అయ్యింది , ఓవర్ డోస్ అయ్యేసరికి లేకి కామెడీ గా మారిపోయింది .. కామెడీ ప్రధానంగా సాగినా ఫాన్స్ కి తగ్గ అంశాలతో పాటు, హీరో ఇమేజ్ కి తగ్గట్టు సీన్ లు రాసుకున్నాడు , అయితే సీన్ లకి తగ్గట్టు కథ రాసుకోలేకపోయాడు .. ఓవరాల్ గా సంక్రాంతి కి కామెడీ – మాస్ – యాక్షన్ చిత్రం ఇది .. కానీ పేలవమైన సెకండ్ హాఫ్ , కథ లేకపోవడం కారణంగా సంక్రాంతి సీజన్ మాత్రమే ఈ సినిమా ని కాపాడాలి . బాక్స్ ఆఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్ గా నిలుస్తుంది . మరీ ఖాళీగా ఉంటే మహేశ్ నటన – ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం ఒక్కసారి చూడచ్చు అంతే ..

Read more RELATED
Recommended to you

Exit mobile version