రేవంత్‌..ఇంకా లైట్ తీస్కో?

-

ఎలాగైనా కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు వృథా అయ్యేలా ఉన్నాయి. ఆయన ఎంత కష్టపడిన పెద్ద ఫలితం ఉండేలా కనిపించడం లేదు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చే అవకాశాలు వెనక్కి వెళుతున్నాయి…కేవలం సొంత పార్టీ నేతల వల్లే మళ్ళీ కాంగ్రెస్ అధికారానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 2004, 2009లో ఉమ్మడి ఏపీని పాలించిన కాంగ్రెస్…తెలంగాణ వచ్చాక వరుసగా రెండు సార్లు అధికారానికి దూరమైంది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరించలేదు. దీంతో 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యి, ప్రతిపక్షానికే పరిమితమైంది. సరే వరుసగా రెండుసార్లు ఓడిపోయింది…కానీ ఈ సారి మాత్రం అధికారం దక్కించుకోవాలనే దిశగా పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి రేవంత్ కష్టపడుతున్నారు.

అయితే రేవంత్ దూకుడుగా రాజకీయం చేయడం వల్ల..కొద్దో గొప్పో కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ దూసుకొచ్చింది. కానీ అలా ఈజీగా కాంగ్రెస్ పికప్ అయితే ఎలా…అందుకే సొంత పార్టీ నేతలే ఆ పార్టీని కిందకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతసేపు ఒకరిపై ఒకరు పై ఆధిపత్యం చెలాయించుకోవడం, విమర్శలు చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్‌పై ఎలా పోరాడాలి…బీజేపీని ఎలా ఆపాలి అనే అంశాలని పట్టించుకోవడం లేదు….ఎంతసేపు సొంత పోరుతోనే సరిపోతుంది. తాజాగా కూడా వి.హనుమంతరావు…తనని అవమానించిన ప్రేమ్‌సాగర్‌పై రేవంత్ సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలకు దిగుతున్నారు.

ఇంకా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలో ఇదే రచ్చ నడుస్తోంది…ఇలాగే ముందుకెళితే పార్టీ ఇంకా పికప్ అవ్వదు. ఇప్పుడు ఎలాగో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే వార్ నడుస్తోంది. ఇక ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీది మూడో స్థానమే. కాబట్టి ఇంకా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడుతున్న రేవంత్…ఇంకా లైట్ తీసుకుంటే మంచిదేమో.

Read more RELATED
Recommended to you

Exit mobile version