ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ..!

-

సుప్రీం కోర్టులో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఊరట దక్కలేదు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిటిషన్ ను కొట్టేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. అయితే సుప్రీం కోర్టు లో కూనంనేని సాంబశివరావు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.

అయితే కూనంనేని సాంబశివరావు ఎన్నికల అఫిడవిట్ సరిగా దాఖలు చేయలేదంటూ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ వేశారు నందులాల్. అయితే నందులాల్ వేసిన పిటిషన్ ను క్వాష్ చేయాలంటూ మొదట తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు సాంబశివరావు. కానీ తెలంగాణ హైకోర్టు నందులాల్ పిటిషన్ ను క్వాష్ చేయడానికి నిరాకరించడంతో. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా ఫలితం అనేది రాలేదు. సుప్రీం కోర్టు కూడా కూనంనేని పిటిషన్ ను తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version