కాంగ్రెస్‌కు మొన్నటి వరకు అసలు ఏ జిల్లాలోనూ పట్టు లేదనే చెప్పాలి. ఒక్క నల్లగొండ జిల్లాలో తప్ప మిగతా జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో అసలు ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డ సమయంలో రేవంత్ బాధ్యతలు తీసుకోవడం కొంత కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన నేతృత్వంలో ఏయే జిల్లాల్లో తమ పార్టీ వీక్‌గా ఉంటుందో తెలుసుకుని అక్కడ పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఇక ఇప్పుడు తమకు పట్టులేని మరో జిల్లా కోసం రేవంత్ కదిలారు.
ఇక ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలొ పట్టు పెంచుకునేందుకు ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరాను మోగించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలో మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇంద్రవెల్లి తరహాలోనే ఆగస్టు 18న ఇబ్రహీంపట్నంలో రెండో బహిరంగ సభను నిర్వహిచనున్నారు.
ఇక దీని తర్వాత మూడో బహిరంగ సభ మాత్రం తమకు అసలు ఏ మాత్రం పట్టులేనటువంటి జిల్లా అయిన వరంగల్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బహిరంగ సభకు సంబంధించిన ప్రోగ్రామ్ గురించి వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సమాచారం అందినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉన్న జిల్లాగా వరంగల్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పట్టు కాస్తా కోల్పోవడంతో మళ్లీ దానిపై రేవంత్ దృష్టి పెట్టినట్టు సమాచారం. చూడాలి మరి ఆయన ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.