RGV : పాక్‌పై భారత్‌ ఓటమి ; కేజ్రీవాల్‌ కు ఆర్జీవీ కౌంటర్‌ !

-

దుబాయ్‌ వేదికగా టీమిండియా పరువు మంట గలిసిపోయింది. టీ-20 వరల్డ్‌ కప్‌లో పాక్‌ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీసేన.. 45 ఏళ్లపాటు కొనసాగిన రికార్డును చెరిపేసింది. ప్రపంచ కప్‌ లో ఎప్పుడూ పాక్‌ స్థాన్‌ జట్టు పై ఓడిపోని… టీమిండియా నిన్న ఘోరంగా ఓటమి పాలైంది. టీమిండియా టాప్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో…. మ్యాచ్‌ లో పాక్‌ చేతిలోకి వెళ్లింది. అయితే.. పాక్‌ పై టీమిండియా ఓటమి చెందడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

క్రీడాల్లో గెలుపు, ఓటములు చాలా సహజమని… పాక్‌ పై ఓటమి చెందినందుకు ఆందోళన వద్దని… టీమిండియాకు సలహాలు ఇచ్చారు. అలాగే… ఈ పీడ కలను మరిచిపోయి… ప్రపంచ కప్‌ ఫైనల్‌ లో గెలిచే విధంగా ముందుకు వెళ్లండంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. కేజ్రీవాల్‌ చేసిన ట్వీట్‌ కు టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.

” నిన్నటి మ్యాచ్‌ లో ఒక వేళ టీమిండియా.. పాక్‌ స్థాన్‌ జట్టుపై గెలిచి ఉంటే… పాక్‌ క్రికెటర్లకు ఇలాగే సూచనలు ఇస్తారా ? అని నేను ప్రశ్నిస్తున్నా. చెప్పండి” అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ కు రిప్లై ఇచ్చారు. అలాగే.. కోహ్లీపై ప్రశంసలు కురించారు రాం గోపాల్‌ వర్మ. మ్యాచ్‌ ఓటమి పాలైనప్పటికీ… ప్రత్యర్థి జట్టును ప్రశంసించిన కోహ్లీకి వందనాలు అంటూ పేర్కొన్నారు వర్మ. ఇక వర్మ చేసిన ఈ ట్వీట్లపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version