“పవర్ స్టార్” నుంచి రొమాంటిక్ పోస్టర్‌ విడుదల..!

-

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ “పవర్‌ స్టార్‌” పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో తనదైన దారిలో వెళ్తున్న ఆర్జీవీ.. రకరకాల కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రష్యన్ మహిళకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఈ రోజు విడుదల చేశారు. “పవర్ స్టార్ సినిమా నుంచి ‘పవరొమాంటిక్’ పోస్టర్‌ ఇదిగో” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఆయన ప్రెజెంట్ లైఫ్‌పై వర్మ కన్నేశారని ఈ పోస్టర్స్ చూసిన జనం చెప్పుకుంటున్నారు. కాగా ”లార్డ్ బాలాజీ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ మూవీలో ఎవరినీ తక్కువ చేసి చూపించను” అని వర్మ పేర్కొనడం మరో ఆసక్తికర అంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version