ధనుష్‌ విడాకులపై RGV సంచలన ట్వీట్‌..పెళ్లి అంటేనే ఓ జైలు !

-

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ కూతురు నిర్మాత ఐశ్వ‌ర్య జంట విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఈ జంట త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా సోమ వారం రాత్రి అధికారికంగా ప్ర‌కటించారు. త‌మ సోష‌ల్ మీడియాలో ఒక లేఖ ను పోస్టు చేసి.. తాము విడిపోతున్నామ‌ని పేర్కొన్నారు. పరస్పర ఒప్పందంతోనే తాము విడిపోతున్నట్లు చెప్పారు.

అయితే… వీరిద్దరి విడాకులపై టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన స్టైల్‌ లో స్పందించారు. పెళ్లి అంటేనే ఓ జైలు అంటూ ఓ ట్వీట్ చేశారు వర్మ. ” ధనుష్‌ లాంటి చాలా మంది ప్రముఖులు.. విడాకులు ఇచ్చి.. యువతను కాపాడుతున్నారు. పెళ్లి అంటేనే ఓ జైలు. పెళ్లి చేసుకునే బదులు… ఎప్పటికీ ప్రేమించుకుంటునే ఉండాలి. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా మనం ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యం.” అంటూ RGV సంచలన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version