ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం “డ్రాగన్”. ఈ సినిమాలో కాంతారా ఫేమ్ రిసబ్ శెట్టి ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తారని ప్రచారాలు సాగుతున్నాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రిషబ్ శెట్టి పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ విషయం పైన చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, డ్రాగన్ సినిమాలో టోవినో థామస్, అనిల్ కపూర్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.

డ్రాగన్ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ అంచనాల నడుమ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.