Rishabh panth : కారు నుంచి దూకేసిన రిషబ్ పంత్

-

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది.

అయితే, ఉత్తరాఖండ్ రూర్కి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్ ప్రాణాలను దక్కించుకునేందుకు కారులో నుంచి దూకేసినట్లు తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న అతడి బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి రేయిలింగ్ ను ఢీ కొట్టింది.

దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. తప్పించుకునేందుకు పంత్ కారు నుంచి బయటకు దూకేసినట్లు సమాచారం. కాసేపటికి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ కారులోనే ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version