పదేళ్లలో కొవిడ్‌ తరహా మరో వైరస్ వ్యాప్తి.. ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ వార్నింగ్

-

కరోనా మహమ్మారి గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. గత ఆరు నెలలుగా కాస్త తగ్గుముఖం పట్టిందని సాధారణ జీవనం గడుపుతున్న ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చింది. మళ్లీ విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుతం దేశంలో మళ్లీ కొవిడ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇదిలా ఉంటే ఎయిర్​ఫినిటీ అనే ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన ఓ విషయం మరింత ఆందోళనను కలిగిస్తోంది.

వచ్చే పదేళ్లలో కొవిడ్‌ తరహా మరో మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ముప్పుందని ‘ఎయిర్‌ఫినిటీ హెచ్చరించింది. అందుకు అవకాశాలు 27.5% ఉన్నట్లు తెలిపింది. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాల పెరుగుదల, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యమున్న కొత్త వ్యాధుల పుట్టుక వంటివి అందుకు కారణమవుతాయని పేర్కొంది.

మహమ్మారిని గుర్తించిన 100 రోజుల్లోగా సమర్థ వ్యాక్సిన్లను ఆవిష్కరించగలిగితే మాత్రం దాన్ని నివారించే అవకాశం ఉంటుందని ఎయిర్‌ఫినిటీ తెలిపింది. బర్డ్‌ఫ్లూ తరహా వైరస్‌ పరివర్తన చెంది.. మనిషి నుంచి మనిషికి సోకుతూ విజృంభిస్తే బ్రిటన్‌లో ఒక్కరోజులో 15 వేలమంది మృత్యువాతపడేంత దారుణ పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేసింది. బర్డ్‌ఫ్లూ ప్రస్తుతం మనుషులకు సోకుతున్నట్లు ఆధారాలు లేకపోయినా.. అది పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుండటం, క్రమంగా క్షీరదాలకూ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version