బిగ్ బ్రేకింగ్: రియా చక్రవర్తి అరెస్ట్

-

డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్  రియా బ్యూరో చక్రవర్తిని అదుపులోకి తీసుకుంది. మూడురోజుల విచారణ తర్వాత రియా చక్రవర్తి ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. సుశాంత్ మృతి కేసులో గత కొన్ని రోజులుగా రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆమెను విచారిస్తున్న అధికారులు డ్రగ్స్ కోణంలో కూడా విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఆమె డ్రగ్స్ సరఫరా చేసినట్లు అదే విధంగా ఆమె సిఫారసు చేయడంతో దాన్ని కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు.

ఆమె మొత్తం బాలీవుడ్లో 25 మంది పేర్లు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె అరెస్టుతో సినీ వర్గాల్లో కలకలం రేగింది అయితే ఆమె ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేసింది అనేదానిపై ఇంకా మీడియాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె చెప్పిన 25 మంది కూడా ప్రముఖులే అని వార్తలు వస్తున్నాయి మొత్తం పది మంది స్టార్ నటులే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version