బీహార్ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డియేని ఓడించడానికి కుట్ర చేసారు అంటూ ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. బీహార్ బిజెపి ఎమ్మెల్యేకు ఫోన్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇక లాలూ యాదవ్ ను గురువారం రాంచీ ఆసుపత్రి డైరెక్టర్ బంగ్లా నుంచి పేయింగ్ వార్డుకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో ఆయన దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్) లో పలు అనారోగ్యాలకు చికిత్స తీసుకుంటున్నారు. రిమ్స్ అదనపు డైరెక్టర్ మరియు జార్ఖండ్ జాయింట్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ వాఘ్మారే కృష్ణ ప్రసాద్ ఈ విషయం జాతీయ మీడియాకు వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. బీహార్ బిజెపి ఎమ్మెల్యే లాలన్ కుమార్ పాస్వాన్ కు ఆయన ఫోన్ చేసారు.