హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

-

హన్మకొండ జిల్లాలో ఇవాళ రహదారి నెత్తురోడింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్… కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు.

ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడుమూరులో బొలెరో వాహనాన్ని ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. దాంతో పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బొలెరో వాహనంలోని ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా… మరో 14 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వారిది హోళగుంద మండలంలోని కొత్తపేట అని గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు సరిగా లేవనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి తరచూ వస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల స్ట్రీట్ లైట్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో హైవేలపై వెళ్తున్నా.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి… వేగంగా వెళ్లడం కంటే.. జాగ్రత్తగా వెళ్లడం మంచిదని గుర్తించాలని పోలీసులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version