నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేశారు : లోకేశ్‌

-

మరోసారి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేశారని, ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని విమర్శించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.

మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని పరోక్ష విమర్శలతో లోకేశ్ హోరెత్తించారు. గత ఎన్నికల తర్వాత మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి వచ్చాయని, సగం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యాడని విమర్శించారు. ఆయనకు పని తక్కువ, డైలాగులు ఎక్కువని ఎద్దేవా చేశారు.

“జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా? ఈ సిల్లీ బచ్చా నాకు చాలెంజ్ విసురుతున్నాడు. చర్చ అంటూ సరదా పడుతున్నాడంట… రా… రా… రా… వచ్చేయ్. నీ సీటు జగన్ ఆల్రెడీ చింపేశాడు బ్రదర్. నేను ఇప్పుడు నాయుడుపేటలోనే తిరుగుతున్నా. దోపిడీ సొమ్ము, బినామీల పేరుతో నువ్వు వేసిన రూ.100 కోట్ల అక్రమ లే అవుట్ ఉంది కదా. షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న నీ వంద కోట్ల లే అవుట్ లో చర్చించుకుందాం. చర్చకి జగన్ ని కూడా తీసుకురావాలి. జగన్ ని కూడా చర్చకి తీసుకొచ్చి దమ్ముంటే నీకు సీటు ఉందని చెప్పించు” అని లోకేశ్ సవాల్ విసిరారు.

హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి, బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి రూ.100 కోట్లు విలువ చేసే అక్రమ లే అవుట్లు వేశారని ఆరోపించారు. సూళ్లూరుపేట ముంపు ప్రాంతాల్లో కరెంట్ పోల్స్ సైతం మునిగిపోయే ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు వేస్తున్నారని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version