బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్… ఒకరు మృతి.

-

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్ పట్టు జిల్లా మారుమళ్ళపురంలో డివైడర్ ను కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ సహా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యాషికా ఆన్ంద స్నేహితురాలు వల్లిశెట్టి భవాని మృతి చెందారు. హైదరాబాదుకి చెందిన వల్లిశెట్టి భవాని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఇటీవలే అమెరికా నుండి ఇండియా వచ్చారని సమాచారం. గాయాలు తీవ్రంగా కావడంతో మిగతావారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

అర్థరాత్రి 1గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారందరూ మద్యం తాగి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాగి నడపడం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం యాషికా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది. గతంలోనూ యాషికా, రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version