రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మ

-

ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. WTC చరిత్రలో 50 సిక్సులు కొట్టిన తొలి ఆసియా ప్లేయర్ గా ఆయన నిలిచారు.హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో రిషభ్ పంత్ (38), యశస్వీ జైస్వాల్ (26), రవీంద్ర జడేజా (26), మయాంక్ అగర్వాల్ (23), అబ్దుల్లా షఫీఖ్ (18), అక్షర్ పటేల్ (17) ఉన్నారు.

ఇదిలా ఉంటే…ధర్మశాల టెస్టులో తొలిరోజు ఇండియా చెలరేగింది. టాస్‌ ఓడి మొదట బౌలింగ్‌ చేసిన ఇండియా.. ఇంగ్లండ్‌ను ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా, ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 135రన్స్ చేసింది. జైస్వాల్ (58 బంతుల్లో 57 రన్స్) ఔట్ కాగా.. రోహిత్(52), గిల్ (26) క్రీజులో ఉన్నారు. ఇండియా 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. తొలిరోజు దూకుడునే వచ్చే 2 రోజుల పాటు ఇండియా కొనసాగించి ఈ మ్యాచ్ లో కూడా ఇండియా విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version