ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్మిత్‌ను అనుక‌రించిన రోహిత్ శ‌ర్మ‌.. ఫ‌న్నీ వీడియో..!

-

రోహిత్ శ‌ర్మ రాక‌తో భార‌త క్రికెట్ జ‌ట్టు కొంత బ‌ల‌ప‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌లే ఆస్ట్రేలియాతో జ‌రిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ ముఖ్య‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్ర‌స్తుతం బ్రిస్బేన్ టెస్టులోనూ అత‌ను ఆడుతున్నాడు. అయితే బ్రిస్బేన్ టెస్టు సంద‌ర్భంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ స‌మ‌యంలో స్టీవ్ స్మిత్ క్రీజులో ఉండ‌గా రోహిత్ ఫ‌న్నీగా ప్ర‌వ‌ర్తించాడు.

గ‌త టెస్టు మ్యాచ్‌లో రిష‌బ్ పంత్‌కు చెందిన బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను స్టీవ్ స్మిత్ చెరిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఆ దృశ్యాలు స్టంప్ కెమెరాల్లో స్ప‌ష్టంగా రికార్డ‌య్యాయి. అయితే ప్ర‌స్తుతం 4వ టెస్టులోనూ రోహిత్ అలాగే స్టీవ్ స్మిత్‌ను అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. స్టీవ్ స్మిత్ చూస్తుండ‌గానే రోహిత్ క్రీజులోకి వ‌చ్చి బ్యాటింగ్ చేసిన‌ట్లు విన్యాసం ప్ర‌ద‌ర్శించాడు. దీంతో ఫ్యాన్స్ తెగ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

రిష‌బ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు గ‌త టెస్టు మ్యాచ్‌లో స్మిత్ బ్యాటింగ్ గార్డు మార్కుల‌ను చెరిపివేయడం ప‌ట్ల స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. స్మిత్ ఒక‌ప్పుడు బాల్ టాంప‌రింగ్ చేస్తూ దొరికిపోయాడ‌ని, అత‌ను బుద్ధిని మార్చుకోలేద‌ని, మ‌ళ్లీ చీటింగ్ చేస్తున్నాడ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శించారు. అయితే రోహిత్ ప్ర‌స్తుతం అత‌న్ని అనుక‌రించిన‌ట్లు చేయ‌డంతో అత‌ని వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version