కంటెంట్‌ లేని సినిమాలాగే జనసేన ఫ్లాప్‌ కావడం ఖాయం : మంత్రి రోజా

-

కంటెంట్‌ లేని సినిమాలాగే జనసేన ఫ్లాప్‌ కావడం ఖాయమని చురకలు అంటించారు ఏపీ మంత్రి రోజా. గడపగడపకు వెళ్తుంటే జగనన్నకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. విశాఖ విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్ లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించారు.

వేడుకలకు రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, “చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకమైన అమలు చేశారా? కేంద్రం, ఇతర రాష్ట్రాలు జగనన్న పథకాలను అనుసరిస్తున్నాయి. పవన్ వారాంతంలో వచ్చి రెండు ట్విట్లు పెట్టి వెళ్లిపోతారు. మంచి కంటెంట్ లేని సినిమాలాగే జనసేన కూడా ఫ్లాప్ అవుతుంది. వేరే పార్టీ జెండా మోసే పవన్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కొత్త వాహనం లేని కలర్ఫుల్ షర్ట్ వేస్తే ఎవరు భయపడరు” అని రోజా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version