ప్రతిపక్ష పార్టీ కారణంగానే పెన్షన్ల పంపిణీ ఆగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది ఇంకో పక్క ఎన్నికల సంఘం అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోక ముందే జగన్ ఏప్రిల్ 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ మూడో తేదీకి వాయిదా వేసినట్లు మీడియాలో అధికారికంగా ఎందుకు ప్రకటించారు అని టిడిపి అంటోంది. నిన్న మొదటి వరకు పెన్షన్ ని అర్హత కలిగిన వారి ఇంటికి వెళ్లి వాలంటీర్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన తర్వాత రానున్న ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లని పనికి దూరంగా ఉంచింది.
దీంతో అధికార పార్టీ నేతలు టిడిపి మీద విరుచుకు పడుతున్నారు. టీడీపీ కారణంగా ఎండలో పెన్షన్ కోసం సచివాలయానికి వచ్చి సొమ్మసిల్లి పడిపోతున్నారని మండిపడుతున్నారు ఈ విషయాన్ని రోజా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. పేదలు అంటే అసహ్యించుకునే ఆయన, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన కుట్రలకి వృద్ధులు వికలాంగులు అవస్థలు పడుతున్నారని అన్నారు వాళ్ల తిప్పలు చూసైనా చంద్రబాబు అతని అనుచరులు మనసు కరగదా అని పోస్ట్ చేశారు.