RR VS SRH: దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్… సన్ రైజర్స్ టార్గెట్ 211 రన్స్

-

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా పరుగులు చేశారు. ఏ దశలోనూ సన్ రైజర్స్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. పుణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బౌండరీలు, సిక్సర్లే లక్ష్యంగా చెలరేగిపోయి ఆడారు రాజస్థాన్ బ్యాటర్లు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ముందు 211 పరుగుల భారీ టార్గెన్ ను ఉంచింది. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఆర్ఆర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు.

ఓపెనర్లుగా వచ్చిన జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్ దంచి కొట్లారు. జోస్ బట్లర్ 28 బాల్స్ లో 35 పరుగులు చేయగా… జైశ్వాల్ 16 బాల్స్ లో 20 రన్స్ చేశారు. ఆతరువాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా సిక్సర్లు, ఫోర్లలో గ్రౌండ్ నలుమూలల పరుగుల వరద పారించాడు. 27 బాల్స్ లో 5 సిక్సులు, 3 ఫోర్ల సహాయంతో 55 పరుగులు చేసి టాప్ స్కోరల్ గా నిలిచాడు. దేవదత్ పడిక్కల్ 29 బాల్స్ లో 41 రన్స్ చేయగా… కరేబియన్ హార్డ్ హిట్టర్ షిమ్రోన్ హెట్మెయర్ కేవలం 13 బంతుల్లోనే 32 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఉమర్ మాలిక్, నటరాజన్ చెరో 2 వికేట్ల తీయగా… భువనేశ్వర్, రోమియో షెఫర్డ్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version