ఆర్ ఆర్ ఆర్ కీల‌క స‌న్నివేశాల‌న్నీ హైర‌దాబాద్‌ లోనే.. ఎక్క‌డెక్క‌డంటే?

-

దేశ‌వ్యావ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. బాహుమ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో దీనిపై చాలానే ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇక ఇందులో ఇద్ద‌రు స్టార్ హీరోలైన ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు న‌టిస్తుండ‌టంతో అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాని షూటింగ్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే సెకండ్ వేవ్ కార‌ణంగా మూవీ షూట్ చాలా వ‌ర‌కు ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ప‌ర‌స్థితులు చ‌క్క‌బ‌డుతుండ‌టంతో ఆర్ఆర్ఆర్ ను తిరిగి స్టార్ట్ చేసేందుకు రాజ‌మౌలి టీమ్ ప్లాన్ చేస్తోంది. కొవిడ్ కేసుల భయం ఉన్నా అన్ని ర‌కాల నిబంద‌న‌లు పాటిస్తూ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు జక్కన్న.

ఇక ఇదే క్ర‌మంలో ఈ మూవీ షూటింగ్‌న హైదరాబాద్ లోని గండిపేట ఏరియాల్లో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారంట‌. సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇక్క‌డే జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటే రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్ద‌రు క‌లిసి చేసే సాంగ్‌పై షూటింగ్ చేస్తార‌ని తెలుస్తోంది. అలాగే రామ్‌చరణ్ తో పాటు ఆలియా భట్ కాంబోలో మ‌రో బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంద‌ని స‌మాచారం. మొత్తానికి జ‌క్క‌న్న హైర‌దాబాద్‌ను కీల‌క స‌న్నివేశాల‌కు ఎంచుకుంటున్నాడ‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version